శకుంతము

 

జనవరి 16, 2023

శకుంతము (ṣakuntamu)

    అర్థము

   (విశేష్యము): పక్షి; పాలపిట్ట

   Meaning

   (noun) : bird; jay

   వాడుక / Usage

శకుంత పక్షుల చేత కాపాడబడినది కనక శకుంతల అని కణ్వమహర్షి నామకరణము చేసారు.
As she was protected by a flock of birds, Kanva named her Sakuntala.

   మెదడుకు మేత / Food for thought

నలదమయంతులిద్దరు మనఃప్రభవానల బాధ్యమానలై
సలిపిరి దీర్ఘవాసర నిశల్ విలసన్నవ నందనంబులన్
నలినదళంబులన్ మృదుమృణాలములన్ ఘనసారపాంసులన్
దలిరుల శయ్యలన్ సలిలధారల జందనచారుచర్చలన్

(నలదమయంతుల మన్మథ తాపంతో ప్రొద్దుగడవని దినాల్లో విరహాన్ని తట్టుకోలేక పూలదోటల్లోనూ, తామరాకుల మధ్యనా, మృదువైన తామర తూళ్ళ మధ్యనా, కర్పూర ధూళి అలముకొంటూ, పూల శయ్యలమీద విశ్రమిస్తూ, చల్లనీటి ధారలలో తడుస్తూ, చందనాన్ని పూసుకొంటూ గడిపారు ఆ తాపాన్ని తట్టుకోలేక)
--అరణ్యపర్వం, ఆది కవి నన్నయ్య (~ పదకొండవ శతాబ్ధము)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి