చలితము
జనవరి 19, 2023
చలితము (chalitamu)
అర్థము
(విశేషణము): కదిలింపబడినది; ప్రాప్తమైనది
Meaning
(adj) : shaken; trembling
వాడుక / Usage
ప్రేయసి కురులు చలితమై మదీయ స్వప్న సౌధంలో తీపి గురుతులు తట్టి లేపాయి.
మెదడుకు మేత / Food for thought
అధికదుఖఃరోగార్తున కౌషధంబు ! సురుచిరంబుగ భార్యయ చూవె యెందు
నొనర భార్యాసమేతుఁడై యున్నవాని ! కెంతలయ్యును నాపద లెఱుక పడవు
(అన్నిరోగాలలో గొప్పరోగం దుఃఖం. గొప్ప దుఃఖ మనే రోగంతో పీడితుడైనవాడికి మంచిమందు భార్యయే సుమా! భార్యతో కూడి ఉన్నవాడికి ఎంతటి కష్టాలైనా అనుభవిస్తున్నట్లు అనిపించవు.)
--ఆంధ్రమహాభారతంలో నల దమయంతి, నన్నయ్య (~ 11వ శతాబ్ధము)
Comments
Post a Comment