లాక్షారుణ
జనవరి 20, 2023
లాక్షారుణ (lākshāruna)
అర్థము
(విశేష్యము): ఎర్ర లక్క (లాక్ష = లక్క, క్రిమి నుంచి వచ్చే బంక; అరుణ = ఎరుపు)
Meaning
(noun) : red lac
వాడుక / Usage
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పద యుగళ.
మెదడుకు మేత / Food for thought
వగవఁగ సాంగోపాంగము ! లగు నాలుగు వేదములయు నధ్యయనము పొ
ల్పుగ నొక సత్యముతో నెన ! యగునే యెవ్వియును పోల వటె సత్యంబున్
(ఆలోచించి చూస్తే నాలుగు వేదాలు, వేదాంగాలు, వేదోపాంగాలు చదివినప్పటికిన్నీ అంతయూ ఒక్క సత్యంతో సరితూగదని పెద్దలు చెపుతారు. సత్యానికి ఏవీ సరిపోలవు)
--ఆంధ్రమహాభారతంలో నల దమయంతి, నన్నయ్య (~ 11వ శతాబ్ధము)
Comments
Post a Comment