కెంజాయ

 

జనవరి 23, 2023

కెంజాయ (ken-zāya)

    అర్థము

   (విశేష్యము): కెంపు (ఎరుపు) + ఛాయ (రంగు); 

   Meaning

   (noun) : red

   వాడుక / Usage

"నిద్దుర మత్తును వదిలించే కెంజాయల జిలుగీ ఖడ్గం".
This sword is the crimson sparkle of dawn that drives stupor away.

   మెదడుకు మేత / Food for thought

ఇప్పుడు ఖరీదైన 4 బెడ్ రూముల అపార్టుమెంటు,
ఏసీలు,సోఫా సెట్లు,కింగ్ సైజు మంచాలు, అమెరికా పరుపులు, పేద్ధ టీవీ, ఖరీదైన కారు ...అన్నీ ఉన్నా.... 
ఎందుకో.. ఆ మూడు వరస గదుల అద్దె ఇంట్లో 
మా అత్త గారు,మేవిద్దరం,ముగ్గురు పిల్లల్తో ఉన్నా 
ఎంతో ఆనందంగా, కళ కళ్ళాడుతూ ఉండేది !
ఇరుకు అనిపించేదే కాదు. 
సెకండు హ్యాండు స్కూటర్  మీద ఆయన అలా ...
గోదారి గట్టు మీదకి తీసుకెడితే ...
ఆ ‘ఇదే’ వేరు !       
ఫ్రిజ్ కూడా లేదు, నలుపు, తెలుపు టీవీ లో చిత్ర లహరి చూస్తుంటే ఏమి ఆనందించాం !
మా ఆడపడుచులు వస్తే అందరం బరకం పరుచుకుని, పడుకుని కబుర్లు చెప్పుకుంటుంటే.. నిద్రే వచ్చేదికాదు !
మా అత్త గారు కూడా మధ్యలో కబుర్లు కలుపుతూ, కునికి పాట్లుపడుతూ,
"ఇంక చాలు, పడుక్కోండి, తెల్లారి పోతోంది, 
మళ్ళీ పెందలాడే లేవాలి" అనేవారు. 
మా కబుర్ల కంటే నవ్వులే ఎక్కువగా ఉండేవి,…
ఎవర్నీ నిద్దరోనీకుండా. 

-- palukuteniyalu.blogspot.com , వింజమూరి వెంకట అప్పారావు

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి