కంటకము

 

జనవరి 26, 2023

కంటకము (kaṇṭakamu)

    అర్థము

   (విశేష్యము): ముల్లు; సూదిమొన; కాకి; విరుద్ధము; చెడ్డమాట; రోమాంచము

   Meaning

   (noun) : thorn; prickle; crow; pest; horripilation

   వాడుక / Usage

దేశప్రగతికి కులమత రాజకీయాలు కంటకాలుగా దాపురించాయి.
Caste and religious politics are a thorn in the side of development.

   మెదడుకు మేత / Food for thought

షేక్ అహ్మద్ బాషా కథలు ‘‘జీవనసంధ్య’’. అత్యంత సహజంగా మధ్యతరగతి కుటుంబాల బాంధవ్యాలు – దంపతుల అన్యోన్యత, సంతానానికి తమ తల్లిదండ్రులపై గల ప్రేమాభిమానాలు అద్ధంలో ప్రతిబింబంలా కన్పించాయి.

‘‘ఓకే టాక్సీ’’ – ఈ కథ మానవ సంబంధాలను సునిశితంగా పరిశీలించేలా రచించారు. నేటి సమాజంలో యువతకు డబ్బు వుంది. ఏదో విధంగా సంపాదిస్తున్నారు. కొందరికీ పెద్ద ఇళ్లు కూడ వున్నాయి. కాని వాళ్ళ మనస్సు హృదయాలు ఇరుకుగా వున్నాయి. మార్పు వస్తే మంచిదే. ‘‘ఒకే టాక్సీ’’లో రాజు తల్లి తినీ, తినక, మనవల కోసం డబ్బు దాచి, అందించడం హృదయాన్ని కలచివేసింది.

‘‘వీడ్కోలు’’ కథ ఉత్తమ ఉపాధ్యాయుణ్ణి కట్టెదుట నిలిపింది. అతడొకశిల్పి – ఫిలాసఫీలో గురువును దైవమని, అంధకారం నుండి వెలుగును చూపే కరదీపిక అని, ఒక దీపం నుండి మరో దీపం వెలిగించే వత్తి అని, వీధిలో వరుసగా నెలకొల్పిన స్తంభాలపై నున్న దారి దీపమనీ చెప్తారు. ఉత్తమ విలువలు పిల్లలకు నాటుకోవాలంటే ఉపాధ్యాయుని వల్ల మాత్రమే సాధ్యం! కధ హృదయలగమం ‘‘సందేశం’’ కధ ‘వీడ్కోలు’కు సమాంతరంగా నడిపేరు బాషాగారు.

‘‘బాబోయ్ హాస్పత్రి’’- ఒక మనిషి రాక్షసుడయి విజృంబిస్తే ఎంత నాశనమవగలదు? ఎందరు అమాయకులు బలి అవుతారు ‘‘వైద్యో నారాయణో హరిః’’ అన్నది ఆర్యోక్తి. పాశ్చాత్యులు కూడ! ‘‘హిప్పోక్రేట్స్’’ విగ్రహం వద్ద వైద్యకళాశాలలో ప్రవేశించిన విద్యార్థుల చేత ప్రమాణం చేయిస్తారు – ఆవృత్తి పవిత్రమైనదని, – విలువలు కాపాడుతామని, అంకితభావంతో పని చేస్తామని, అట్టివారికి మాత్రమే వైద్యులమే అర్హత! అదే అదీ ఆవృత్తి స్థాయి.

‘‘ఫిల్టర్ కాఫీ’’- ఇది కథ కాదు జీవిత సత్యం! అది తాగిన వారికే తెలుస్తుంది ఆ రుచి! ఇక ‘‘అలవాటు’’ వుంది చూసేరూ-ఇది ఒక బలహీనత, కాని అదే బలం, ఉత్తేజం, తృప్తి కూడాను. ఫిల్టర్‌లో తగిన కాఫీ పొడి వేసి, లెవెలుకు సర్ది ఆదిమ్మను నొక్కినీరు మసిలించి తగిన కొల్త మాత్రమే పోసి అది దిగాకే అప్పుడే పొంగిన పాలు, పంచదారలతో కలిపి సేవిస్తే- అది అమృత తుల్యం.
-- https://pustakam.net/?p=22044,   కాళ్ళకూరి శేషమ్మ 

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ