కవాతు
జనవరి 27, 2023
కవాతు (kavātu)
అర్థము
(విశేష్యము): సాము; సైన్యం చేసే కసరత్తు;
Meaning
(noun) : drill; parade
వాడుక / Usage
కనిపించని శత్రువుపై అక్షర కవాతు మువ్వా శ్రీనివాసరావు కవిత 'వైరాయణం'.
మెదడుకు మేత / Food for thought
రాగారాగిణి వంటి సూక్ష్మమైన నాటికలతో తెలుగు రంగస్థలానికే వన్నెపూసిన గొల్లపూడిగారి తెలుగు సమయతిమిరంలో అస్తమించవలిసిందేనా? భగ్న ప్రేమికులు ఇంక ప్రేమ లేదని ప్రేమించరాదని అని మనసుకవి కలము లో బాలు కంఠం తో విలపించరా? పాతుకు పోయిన ఆచారాల్ని ఎదిరిస్తూ వేటూరి సూటి మాటల ఆసరాతో శంకర శాస్త్రిని, శంకరా అని ఎలుగెత్తి మొరపెట్టించిన విశ్వనాధుని తెలుగు అంతరించి పోవాలిసిందేనా? ఆది భిక్షువు వాడినేమి కోరేది బూడిదిచ్చే వాడిని ఏమి అడిగేది అని సరళ తెలుగు లోమన గుండెల్లోకి చొచ్చుకుపోయి, నిగ్గదీసి అడుగు అని వెన్ను తట్టి కర్తవ్యం గుర్తు చేసి తెలుగు సిరులు మనకి తోడిపెట్టిన సీతారామయ్య తెలుగు సమసిపోవలసిందేనా?
మా తాతలు నెయ్యి తిన్నారు మీరు మూతులు నాకండి అంటే భాష బ్రతకదు. మా తెలుగు గొప్పది అని పైన ఉదహరించిన రచనలు పాటలు తో అది బ్రతకదు. నవయుగానికి సరిపడే విధంగా తెలుగు నేర్పాలి క్రొత్త రచయతలు రచనలు రావాలి. ఇది ఇవాల్టి గురించి కాదు. కానీ ఇప్పటి నుంచి నలభై సంవత్సరాల్లో తెలుగు పుస్తకాలు రావాలంటే ఈనాటి ప్రాధమిక విద్యార్థి తెలుగు నేర్చుకోవాలి. భాష మీద అభిమానం పెంచుకోవాలి. బాహ్య ప్రపంచం లో అది వాడగలగాలి. ఆవేశం, ఆనందం, ఆర్ద్రత, జాలి, దుఃఖం కలిగినప్పుడు మనసు చలిస్తే వాళ్ళ యద లోంచి తెలుగు జాలువారాలి. కానీ ఈనాడు అటు బడి లో గాని ఇటు ఇంట్లోగానీ మనం వారికీ వాతావరణం కలగచెయ్యట్లేదు.
భాష ఒక్క మాట్లాడుకునే పనిముట్టు కాదు. ఒక సంఘం, ఒక సాంస్కృతిక సమూహం తరతరాల తమ గుర్తులను, ఆలోచనలను, సాంప్రదాయాలను, విజ్ఞానముని, స్మారక స్థితిని భాషలో నిక్షిప్తం చేస్తాయి. ఇది మన అమూల్యమైన సంపద. కాదు కాదు, ఇది రాబోయే తరాలకు అందచేయడానికి మన రక్షణలో ఉంచిన జ్ఞానవాపి. రండి తెలుగు మాట్లాడుదాం, చదువుదాం , వ్రాద్దాం, నేర్పిద్దాం, ఈ సంపదని పెంపొద్దిద్దాం, పంచుదాం నిలుపుదాం.

-- https://manatelugumaata.blogspot.com/2020/10/blog-post.html
Comments
Post a Comment