గుత్త
జనవరి 30, 2023
గుత్త (gutta)
అర్థము
(విశేష్యము): కౌలు; ఒక వస్తువును కొంత ధనమిచ్చి అజమాయిషీ తీసుకోవడం;
Meaning
(noun) : rent; lease; contract
వాడుక / Usage
పత్తి ధరల పతనం! తెల్ల బోతున్న తెల్ల బంగారం గుత్త రైతులు.
మెదడుకు మేత / Food for thought
కళకే కళ ఈ అందమూఏ కవీ రాయనీ చేయనీ కావ్యమూ
కళకే కళ ఈ అందమూ
నీలి కురులు పోటీ పడెను .. మేఘమాలతో
కోల కనులు పంతాలాడే .. గండుమీలతో
వదనమో జలజమో.. నుదురదీ ఫలకమో
చెలి కంఠం పలికే శ్రీ శంఖము !
పగడములను ఓడించినవి .. చిగురు పెదవులు .. హా
వరుస తీరి మెరిసే పళ్ళు .. మల్లె తొడుగులూ
చూపులో తూపులో .. చెంపలో కెంపులో
ఒక అందం తెరలో దోబూచులు..
తీగెలాగ ఊగే నడుమూ .. ఉండి లేనిదీ
దాని మీద పువ్వై పూచీ .. నాభి ఉన్నదీ
కరములో కొమ్మలో .. కాళ్ళవీ బోదెలో
ఈ రూపం ఇలలో అపురూపము !
-- అమావాస్య చంద్రుడు, వేటూరి (జనవరి 29, 1936, 2010)
Comments
Post a Comment