గంగడోలు

 

జనవరి 31, 2023

గంగడోలు (ganga-ḍōlu)

    అర్థము

   (విశేష్యము): ఆవులకు, ఎడ్లకు మెడకింద వ్రేలాడేసే తోలు; గళకంబళము

   Meaning

   (noun) : dewlap of cows etc

   వాడుక / Usage

చిన్న చెవులు, మూపురం, తోక నేలకు ఆనడం, గంగడోలు కిందకు రావడం, ముందు కాళ్లు పొడవుండి వెనక కాళ్లు పొట్టిగా ఉండటం పుంగనూరు ఆవు లక్షణాలు.
Small ears, hump, tail reaching ground, hanging dewlap, longer forelegs mark the Punganuru cow.

   మెదడుకు మేత / Food for thought

ఆంధ్రజాతికి మూల పురుషుడై విష్ణువే అవతరించెను మా శ్రీకాకుళాన
కృష్ణా తరంగాల సారంగ రాగాలు మువ్వగోపాలా అన్నవిచ్చోట
కదళీపురస్వామి కరుణతో కవితాది కళలెల్ల వర్ధిల్లె మా సీమలోన
కళలకే కళ నేర్పె మా కూచిపూడి, ఇచటనే రేగె బుద్ధుని పాదధూళి 


త్యాగరాజస్వామి రాగరంజనకళా స్థాపనాచార్యుడే మా ఆకుమళ్ల
సంగీత సద్గురువు దక్షిణామూర్తి, తెలుగు పాటల తేట మా పారుపల్లి
మధుర స్వరవారసుడు మంగళంపల్లి, నాదసుధలే తెలుగునాడెల్ల జల్లి
మనజాతికొక పతాకమునిచ్చె పింగళి, అన్నమయ్యకు వెలుగునిచ్చె మన వేటూరి!


-- దివిసీమ జాతీయ గీతం, వేటూరి (జనవరి 29, 1936, 2010)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి