ప్రతిక్షేపము

 

జనవరి 04, 2023

ప్రతిక్షేపము (prathi-kshēpamu)

    అర్థము

   (విశేష్యము): నిరాకరణ; విరోధము; ఒక రాశి స్థానంలో దానికి (ప్రతి) సమానమైన రాశి వ్రాయడం

   Meaning

   (noun) : rejection; throw away; substitution (variables/radicals in math/chemistry)

   వాడుక / Usage

అధిక నీటి అవసరం ఉన్న పంటల ప్రతిక్షేపణ ఇప్పుడు అవసరం.
There is an imminent need to substitute water thirsty crops.

   మెదడుకు మేత / Food for thought

కోయిల పిలుపే కోనకు మెరుపు...
మాయని వలపే మనసుకు మెరుపు...
కోయిల పిలుపే కోనకు మెరుపు...
మాయని వలపే మనసుకు మెరుపు...

నీలి నింగికెంత ఆశ నేలపైన వాలాలనీ...
గాలి అలలకెంత ఆశ పూలపైన తేలాలనీ...

పెదవులకెంత ఆశ... ఎంత ఆశ.... ఎంత ఆశా...
పెదవులకెంత ఆశ... ఎంత ఆశ.... ఎంత ఆశా...
పదే పదే పదే పదే ఒదిగి ఉండాలని...

కడలి పొంగు కోరుతుంది కన్నె వాగు కావాలనీ...
వయసు జల్లు కోరుతుంది వలపు పంట పండాలనీ...

హృదయం కోరుతుంది... కోరుతుంది... కోరుతుంది...
హృదయం కోరుతుంది... కోరుతుంది... కోరుతుంది...
ఇలా ఇలా ఇలా ఇలా కలిసి ఉండాలనీ....

-- అందాల రాశి, డా. సి. నారాయణ రెడ్డి (జులై 29, 1931 - 2017)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి