విపర్యయము
జనవరి 05, 2023
విపర్యయము (viparyayamu)
అర్థము
(విశేష్యము): వ్యత్యాసము; మార్పు; గణిత సిద్ధాంతంలో విషయానికి విరుద్ధమైనది
Meaning
(noun) : difference; change; converse
వాడుక / Usage
నాటకంలో పాత్రలు నాటకాంతర భావోద్వేగాలతో మేళవించిగాని విపర్యాయముగా గాని ఉంటాయి.
మెదడుకు మేత / Food for thought
అడిగిన ప్రశ్నలు చెప్పని
మిడిమేలపు టీచరులతొ మెలగుకంటెన్
వడిగొని ట్యూషను వెట్టుక
బడి ప్యాసవ వచ్చుగాదె వసుధను కుమతీ!
అధరము తడిసీ తడియక
మధురమ్మగు కాఫిజుర్రి మరి సిగరెట్టున్
ప్రథమముననె ముట్టించెడు
విధమేపో లైఫులోని విజ్ఞత కుమతీ!
మిడిమేలపు టీచరులతొ మెలగుకంటెన్
వడిగొని ట్యూషను వెట్టుక
బడి ప్యాసవ వచ్చుగాదె వసుధను కుమతీ!
అధరము తడిసీ తడియక
మధురమ్మగు కాఫిజుర్రి మరి సిగరెట్టున్
ప్రథమముననె ముట్టించెడు
విధమేపో లైఫులోని విజ్ఞత కుమతీ!
-- సుమతీ శతకానికి పేరడీ, కుమతీ శతకం, ఆచార్య పుల్లెల రామచంద్రుడు (అక్టోబర్ 24, 1927 - 2015)
Comments
Post a Comment