పట్టకము
జనవరి 06, 2023
పట్టకము (pattakamu)
అర్థము
(విశేష్యము): నమిలిన తాంబూలం ఉమ్మివేయు తొట్టె; చివరలు సమాన బహుభుజములు, ప్రక్కలు సమాన చతుర్భుజములు గల ఘన రూపం
Meaning
(noun) : spitting pot; prism
వాడుక / Usage
సంస్కృతి, పోషణ, నిర్మాణ కళ అనే పట్టకంలోంచి చూస్తే వివిధ కాలాల్లో భారత వాస్తుకళ మిరుమిట్లు గొలుపుతుంది.
మెదడుకు మేత / Food for thought
తలచినదే జరిగినదా దైవం ఎందులకు
జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు
ముగిసిన గాథ మొదలిడదుదేవుని రచనలలో
మొదలిడు గాథ ముగిసేదెపుడో మనుజుల బ్రతుకులలో
మనసునకెన్నో మార్గాలు
జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు
ముగిసిన గాథ మొదలిడదుదేవుని రచనలలో
మొదలిడు గాథ ముగిసేదెపుడో మనుజుల బ్రతుకులలో
మనసునకెన్నో మార్గాలు
కనులకు ఎన్నో స్వప్నాలు
ఎవరొస్తారో ఎవరుంటారో ఏమౌనో మన కలలు
ఎదలో ఒకరే కుదిరిననాడు మనసే ఒక స్వర్గం
ఒకరుండగా వేరొకరొచ్చారా లోకం ఒక నరకం
ప్రేమ పవిత్రం పెళ్లి పవిత్రం
ఎది నిజమౌ బంధం
ఎది అనురాగం ఎది ఆనందం
బ్రతుకునకేదీ గమ్యం
మంచి చెడు మారేదే మనదన్నది మాటేదే
ఇది సహజం ఇది సత్యం ఎందులకీ ఖేదం
తలచినదే జరిగినదా దైవం ఎందులకు
జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు
ఎవరొస్తారో ఎవరుంటారో ఏమౌనో మన కలలు
ఎదలో ఒకరే కుదిరిననాడు మనసే ఒక స్వర్గం
ఒకరుండగా వేరొకరొచ్చారా లోకం ఒక నరకం
ప్రేమ పవిత్రం పెళ్లి పవిత్రం
ఎది నిజమౌ బంధం
ఎది అనురాగం ఎది ఆనందం
బ్రతుకునకేదీ గమ్యం
మంచి చెడు మారేదే మనదన్నది మాటేదే
ఇది సహజం ఇది సత్యం ఎందులకీ ఖేదం
తలచినదే జరిగినదా దైవం ఎందులకు
జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు
-- మనసే మందిరం, ఆచార్య ఆత్రేయ (మే 07, 1921 - 1989)
Comments
Post a Comment