కైమోడ్పు

 

జనవరి 25, 2023

కైమోడ్పు (kai-mōḍupu)

    అర్థము

   (విశేష్యము): కై (తమిళంలో కయి) = చేయి; మోడ్పు = ముయ్యడం/మడవడం; చేతులు ముడిచి నమస్కరించడం

   Meaning

   (noun) : salutation

   వాడుక / Usage

తెలుగుభాషకు కైమోడ్పులు పెడుతూనే ఏడాదిలో ఒక్క తెలుగు పుస్తకం చదవని మన రెండు నాల్కల ధోరణికి జేజేలు .
Salute to our hypocrisy that salutes Telugu but doesn't read even one book in a year.

   మెదడుకు మేత / Food for thought

తెలిసిన రచయితల పుస్తకాలు కాస్త పక్కన పెట్టి, కొత్త రచయితల వేటలో సాగింది 2022. చదివిన వన్నీ కాకపోయినా, అందులో నచ్చినవి, ఇతర పాఠకులకు ఉపయోగపడతాయి అనుకున్న కొన్ని ఇక్కడ.
మంచి వెన్నెల వేళ – సుస్మిత
గత ధనుర్మాసంలో ఇంటికి వచ్చిన రంగడి ప్రసాదం, ఈ పుస్తకం. రేపల్లె, యమున, కృష్ణ లీలలు, ఈ కథలు. ఎంత అందంగా చిత్రీకరించారో. చిన్నప్పుడు భాగవతం కథలు విన్న ప్రతిసారి వినాలనిపించేవి. ఎన్ని సార్లు చదివాను ? ఎన్నో సార్లు. కుదిరిన ప్రతిసారీ. మళ్ళీ ఇంకో కొత్త కోణంలో ఇలా. తిరుప్పావై పాశురాలని మా రంగనాథ గుడిలో వినడమే కానీ, ఎప్పుడూ ఒక పుస్తకరూపంలో చదవలేదు. కృష్ణశాస్త్రి గారి పాటలకు ఒక కథను అల్లి, అసలు ద్వాపరయుగంలో గోపికలు ఆ కిట్టయ్య కోసం చేసిన “కాత్యాయని వ్రతం” ఆధారం చేసుకొని ఎంత బాగా రాశారో.
చలం లేఖలు తారకానికి
ఇప్పటివరకు బయటకు రాని ఉత్తరాలు. ఆయన రాసిన నాలుగు లైన్ల ఉత్తరంలో కూడా, పది కొత్త పదాలు దొరుకుతాయి. అది ఆయన వచనం యొక్క మ్యాజిక్. అప్పుడప్పుడు, రోజుకొకటి. 
“ఏ రోజు మన సాధన మనకు ఉపయుక్తము అవుతుందో, ఆ రోజే సాధనకు విశ్రాంతి దొరుకుతుంది. విశ్రాంతినేకాదు, శ్రాంతిని కూడా సాధనంగా తీసుకోవడం నేర్చుకోవాలి మనం.”
పాటలు పుట్టిన తావులు – వాడ్రేవు చినవీరభద్రుడు
కొత్త సాహిత్యం గురించి తెలుసుకోవాలంటే ముందుగా భద్రుడు గారి బ్లాగ్ చదవాలి. అందులో దొరకనిది ఉంటుందా ? సంగ సాహిత్యం యొక్క విశిష్టత, ఆ భక్త కవుల గొప్పతనం, ఆ గోపురాలలో ఉన్న ఎన్నో విషయాలు, ఆ కవుల పాటల్ని తెలుగులోకి అనువదిస్తూ వేరే లోకంలోకి తీసుకువెళ్తారు. తమిళ సాహిత్యం పట్ల మక్కువ పెరగడానికి తొలి మెట్టు.
-- https://pustakam.net/?p=22121,   విశ్వనాథ అశోకవర్ధన్ 

    Comments

    Popular posts from this blog

    పథము

    మచ్చుతునక

    తెరువరి