వైతాళికుడు

 

జనవరి 17, 2023

వైతాళికుడు (vytalikudu)

    అర్థము

   (విశేష్యము): రాజుకు వేకువున మేలుకొలుపు పాడేవాడు; ప్రబోధకుడు

   Meaning

   (noun) : a bard who wakes up a king with music; Guru who awakens populace

   వాడుక / Usage

స్వామీ వివేకానందనవయుగ వైతాళికడు బహుముఖ ప్రజ్ఞాశాలి సంఘ సంస్కర్త సాహిత్యవేత్త.
Swami Vivekananda, multifaceted social reformer, blew the bugle to awaken a slumbering populace.

   మెదడుకు మేత / Food for thought

అనలసంబంధ వాంఛనాకగున యేని
అనల సంబంధవాంఛ నాకగునుఁ జూవె

(దమయంతి స్వయంవరానికి బయలుదేరిన నలుడికి దిక్పాలకులు తారసపడి వారి నలుగురిలో ఒకరిని చేసుకోవాలని నలుడినే రాయబారిగా పంపించారు. అప్పుడు అతనితో దమయంతి అన్న మాటలు ఇవి. పద్యంలో రెండు పంక్తులు ఒకే రకంగా ఉన్నా అర్థాలు వేరు! నలుని కాని (అనల) వానితో సంబంధం పెట్టుకునే కోరిక కలిగితే చాలు, అగ్నికి (అనల) నేను ఆహుతి అయినట్లే!!)
--శృంగార నైషధము, కవి సార్వభౌముడు శ్రీనాథుడు (1365 - 1441)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి