తండము
జనవరి 09, 2023
తండము (tanḍamu)
అర్థము
(విశేష్యము): సమూహము; గుంపు; దండు
Meaning
(noun) : a group; multitude; an assembly; mass
వాడుక / Usage
తప్పులెన్నువారు తండోప తండంబు లుర్విజనులకెల్ల నుండు దప్పు.
మెదడుకు మేత / Food for thought
ఏల ఏప్పు డెవ్వడిత్యాది ప్రశ్నలే
పశువు నుంచి వెరుపరిచె నరుని
ప్రశ్నతోనే నరుడు పరిణామమొందెరా
నవయుగాల బాట - నార్ల మాట!
ప్రకృతినే జయించి, పరమాణువును చీల్చి
శాస్త్రవేత్త కూర్చే సకల సిరులు,
రాజకీయ వేత్త రణమును కూర్చెరా!
నవయుగాల బాట - నార్ల మాట !
-- ప్రముఖ పాత్రికేయులు, హేతువాది - నార్ల వెంకటేశ్వరరావు (డిసెంబర్ 01, 1908 - 1985)
Comments
Post a Comment