తొలకరి

 

ఫిబ్రవరి 10, 2023

తొలకరి (tola-kari)

    అర్థము

   (విశేష్యము): చైత్ర/వైశాఖ మాసములందు కురిసే వాన; వర్ష ఋతువు;  

   Meaning

   (noun) : first showers of the season; rainy season

   వాడుక / Usage

 తొలకరి జల్లులో తొలి ప్రేమ యదలో ఈ రేయి హాయిలే.
 Love in the heart, early showers on the face, night of ecstasy it is.

   మెదడుకు మేత / Food for thought

ఓ బాటసారి...ఇది జీవిత రహదారి 

ఎంత దూరమో... ఏది అంతమో
ఎవరు ఎరుగని దారి ఇది
ఒకరికె సొంతం కాదు ఇది 


ఎవరు ఎవరికి తోడౌతారో.... ఎప్పుడెందుకు విడిపోతారో
మమతను కాదని వెళతారో... మనసే చాలని ఉంటారు
ఎవ్వరి పయనం ఎందాకో...
అడగదు ఎవ్వరిని... బదులే దొరకదని


కడుపుతీపికి రుజువేముందీ... అంతకు మించిన నిజమేముందీ...
కాయే చెట్టుకు బరువైతే.... చెట్టును భూమి మోస్తుందా..
ఇప్పుడు తప్పులు తెలుసుకొనీ... జరిగేదేమిటనీ..క్షమించదెవ్వరినీ


ఓ..బాటసారీ..ఇది జీవిత రహదారీ

-- ఇల్లాలు, ఆచార్య ఆత్రేయ (మే 07, 1921 - 1989)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి