ఘంటాపథం
ఫిబ్రవరి 17, 2023
ఘంటాపథం (ghanṭa-pathamu)
అర్థము
(విశేష్యము): పది బారలు వెడల్పుగల రాజ బాట; రాచయేనుగుల ఘంటలు మ్రోగే దారి; నిస్సందేహమైనది; సందిగ్థతకు వీలు లేనిది
Meaning
(noun) : king's highway; something said with force and unequivocally
వాడుక / Usage
న్యాయమూర్తుల నియామకంలో కాలేజియం ప్రతిపాదనలకు తిరుగులేదని సుప్రీమ్ కోర్టు ఘంటాపథంగా తేల్చి చెప్పింది.
మెదడుకు మేత / Food for thought
ఆనందం అంటే ఏమిటో వెతుకుతూ ఉన్నావంటే ఎప్పటికీ ఆనందముగా ఉండలేవు. జీవితానికి అర్థం వెతుకుతూ ఉన్నావంటే ఎన్నటికీ జీవించలేవు. మనిషి ఒక్కడే తనకు తనలాగా ఉండటానికి జంకుతాడు.....నన్ను నేను ఆత్మాహుతి చేసుకోనా లేక ఒక కప్పు కాఫీ త్రాగనా?..కానీ మనిషికి చచ్చిపోడంకన్నా బ్రతకడానికే ఎక్కువ ధైర్యం కావాలి.
-- ఫ్రెంచ్ తత్వవేత్త,రచయిత, ఆల్బర్ట్ కామూ (నవంబర్ 07, 1913 - 1960)
Comments
Post a Comment