మెరమెచ్చు

 

ఫిబ్రవరి 20, 2023

మెరమెచ్చు     (mera-mecchu)

    అర్థము

   (విశేష్యము): మిక్కిలి మెప్పు/మెచ్చు; కొనియాడు; ముఖస్తుతి; పైపై పొగడ్తలు

   Meaning

   (noun) : enthusiastic praise; shallow praise/compliment

   వాడుక / Usage

 మెరమెచ్చు కబుర్లు చెప్పి పబ్బం గడుపుకునే మీడియా ప్రభుత్వాన్ని ప్రశ్నించే బాధ్యతకు తిలోదకాలు వదిలేసింది.
 Showering shallow praises on government, media has given up it's duty of questioning.    

   మెదడుకు మేత / Food for thought

మీరజాలగలడా....
మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి


నటన సూత్రధారి మురారి ఎటుల దాటగలడో నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
నటన సూత్రధారి మురారి ఎటుల దాటగలడో నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి

మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి

సుధాప్రణయజలధిన్ వైదర్భికి ఈడతావు గలదే
నాతోనిక వాదులాడగలడా సత్యాపతి
సుధాప్రణయజలధిన్ వైదర్భికి ఈడతావు గలదే
నాతోనిక వాదులాడగలడా సత్యాపతి

మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి

మధుర మధుర మురళీగానరసాస్వాదనమున..ఆ..ఆ..
మధుర మధుర మురళీగానరసాస్వాదనమున
అధర సుధారస మదినే గ్రోలగ
అధర సుధారస మదినే గ్రోలగ

మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
మీరజాలగలడా...


-- శ్రీకృష్ణ తులాభారం (1966)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి