తెంపరి

 

ఫిబ్రవరి 21, 2023

తెంపరి     (thempari)

    అర్థము

   (విశేషణము): తెంపు(తెగింపు) కలవారు; సాహసి; 

   Meaning

   (noun) : brave/dashing person

   వాడుక / Usage

 వ‌గ‌రు, పొగ‌రు క‌ల‌గ‌లిసిన పాత్రల్లో ఇమిడిపోయి ప్రేక్ష‌కుల‌కు త‌న తెంప‌రి త‌నంతో క‌నువిందు చేసిన న‌టి జ‌మున.
 Jamuna dazzled in her roles as an acerbic, haughty and dashing woman.    

   మెదడుకు మేత / Food for thought

ఒక తెలుగువాడు తెలుగు శ్రోతలతో ఆంగ్లంలో ప్రసంగించేసరికి 
జంఘాలశాస్త్రి ఉద్వేగభరితుడై ఇలా అంటాడు - 

"మ్యావుమని కూయలేని పిల్లి యెచ్చటైననుండునా? 
కిచకిచలాడలేని కోతిని మీరెక్కడైన చూచితిరా? ... 
అయ్యయ్యో. మనుజుడే. అంత మనుజుడే. 
ఆంధ్ర మాతాపితలకు బుట్టినవాడే. .. అట్టివాడాంగ్లేయభాషనభ్యసించినంత మాత్రమున ఇప్పుడాంధ్రమున మాట్లాడలేకుండునా? 
ఆశ్చర్యము, అవిశ్వసనీయము. అసత్యము. ఆంధ్రమున మాటాడకుండ చేసినది అశక్తికాదు. అనిష్టత. అసహ్యత. అది శిలాక్షరమైన మాట. .. 
తెలుగుబాస యంత దిక్కుమాలిన బాస లేదనియే యా యాంగ్లేయ తేజస్సు నమ్మకము"

స్వభాష, శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావు (ఫిబ్రవరి 11, 1865 - 1940)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి