తావు
ఫిబ్రవరి 22, 2023
తావు (ṭhāvu)
అర్థము
(విశేష్యము): స్థానము; గృహము; చోటు; జాగా
Meaning
(noun) : place; house
వాడుక / Usage
ప్రభుత్వాన్ని విమర్శించే వ్యాసాలకి పత్రికల్లో తావు లేని నాడు ప్రజాస్వామ్యానికి గడ్డుకాలం వచ్చినట్లే.
మెదడుకు మేత / Food for thought
తెలుగు చచ్చిపోవడం అంటే ఏంటి? పోతన భాగవతం గతించి పోవడం. స్మశానంలో ఉండే నీకు ఇద్దరు భార్యలు ఎందుకు అని శివుడినే నిలదీసిన శ్రీనాధ చాటువుకి చాటింపు లేకపోవడం. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న క్రిష్ణదేవరాయులు ధీమాని మన చేజేతులా చట్టుబండలు చెయ్యడం.
తెలుగు చచ్చిపోవడం అంటే - త్యాగయ్య గాత్రాలు త్యజించు కోవడం. కుతుబ్ షా చెరలో రామదాసు వ్యధ వ్యర్థం కావడం. అన్నమయ్య కీర్తనలులేక బ్రహ్మపాదం మలిన పడడం.
తెలుగు చచ్చిపోవడం అంటే - మధురవాణి మూగబోయి, గురజాడ కన్యాశుల్కం శుష్కించుకు పోవడం. చిలకమర్తి గారి పాడి ఆవు అనాధ అయిపోవడం. గిడుగు పంతులుగారి భాషోద్యమం వెలవెల పోవడం.
తెలుగు చచ్చిపోవడం అంటే - కల్పకల్పాలకు నీడనిచ్చే విశ్వనాధ కల్పవృక్షం పెకలించ పడడం. దేవులపల్లి ప్రియ భారతి లో భావం భూస్థాపితం చేయడం. శ్రీశ్రీ మహాప్రస్థానం యొక్క పదఝరి ఉడుకురక్తాలలో ప్రవహించకపోవడం.

-- https://manatelugumaata.blogspot.com/2020/10/blog-post.html
Comments
Post a Comment