గ్రోలు

 

ఫిబ్రవరి 23, 2023

గ్రోలు     (grōlu)

    అర్థము

   (క్రియ): అనుభవించు; త్రాగు; తిను

   Meaning

   (verb) : to enjoy; eat; drink

   వాడుక / Usage

 "అమృతము గ్రోలు జిహ్వ చవియంచుఁ దలంచునే తేనె".
  Tongue that has tasted nectar, will it relish honey.    

   మెదడుకు మేత / Food for thought

అంతామిథ్య తలంచిచూచిన నరుండట్లౌటెఱింగిన్‌ సదా
కాంతల్పుత్రులు నర్థమున్‌ తనువు నిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతింజెంది చరించుఁగాని పరమార్థంబైన నీయందుఁ దాఁ
జింతాకంతయుఁ జింతనిల్పఁడు గదా శ్రీకాళహస్తీశ్వరా!

(ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! ప్రపంచమంతా మిథ్య అని తెలిసి కూడా సంసారభవభందనములు వీడలేక కాంతాపుత్రనిజగృహ మోహమును విడిచి నీయందు ఒక చింత ఆకు సమమైన భక్తిని కూడా నిలపడు 
కదా ప్రభో కాళహస్తీశ్వరా!)

-- ధూర్జటి (~ 1480 - 1545)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి