ఆస్వాదనము

 

ఫిబ్రవరి 24, 2023

ఆస్వాదనము     (ā-svādanamu)

    అర్థము

   (విశేష్యము): తినడం; త్రాగడం; రుచి చూడడం; అనుభవించడం

   Meaning

   (noun) : feasting; enjoying; experiencing

   వాడుక / Usage

 "మధుర మధుర మురళీగానరసాస్వాదనమున అధర సుధారస మదినే గ్రోలగ".
   Sweet nectar of flute emanating from lips, feasted my heart.    

   మెదడుకు మేత / Food for thought

అయిదేళ్ళకోసారి
అసెంబ్లీలో మొసళ్ళు
పార్లమెంటులోకి
తిమింగలాలూ
ప్రవేశించడం పెద్ద విశేషంకాదు
జనమే ..
ఓట్ల జలాశయాలై
వాటిని బతికించడం
విషాదం...

పాత ప్రభుత్వాల్లో
చితికిపోయిన
ప్రజలు…
కొత్త ప్రభుత్వాల్లో
”చితి “ కి
పోకుంటే చాలు..

-- అలిశెట్టి ప్రభాకర్  (జనవరి 12, 1954 - 1993)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి