అడంగు

 

ఫిబ్రవరి 27, 2023

అడంగు     (adangu)

    అర్థము

   (విశేష్యము): పుట్టినచోటు; అణుగు; దాగు; కప్పబడు; గ్రామకరణాల లెక్కల పుస్తకం; గిట్టుబాటు ధర; పడవలో కూచోడానికి అడ్డుచెక్క; గమ్యస్థానం

   Meaning

   (noun) : originating place; humbled; conceal; hidden; accounts book; fair price; plank to sit on boat; terminus

   వాడుక / Usage

 అడంగు తెలియని ప్రయాణం సుడిగుండాల్లో చిక్కుకున్న జీవితం.
 Life trapped in a whirlpool journeying to an unknown destination.    

   మెదడుకు మేత / Food for thought


తెలుగు నాటకాలలో చిరస్మరణీయమైనది గయోపాఖ్యానం. చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు రచించిన ఈ నాటకం, ఆనాటి నుండి నేటి వరకూ నిత్యనూతనంగానే వర్ధిల్లుతోంది. ఒక చిన్న కథని బిగువైన నాటకంగా ఎలా తీర్చిదిద్దాలో గయోపాఖ్యానం నాటకాన్ని చూస్తే అర్థం అవుతుంది. అత్యంత ఆప్తులైన ఇద్దరి మధ్య సంఘర్షణ సృష్టించబడితే, దానిని రసవత్తరంగా నాటకీయం చేయగలిగితే, అది ఎంత గొప్పగా , ప్రేక్షకుల్ని ఆకర్షిస్తుందో అనడానికి సజీవమైన నిదర్శనం గయోపాఖ్యానం. రామకవి రచించిన, పద్యకావ్యం ఆధారంగా, నేను ఈ గయోపాఖ్యానం వ్రాశానని చిలకమర్తివారు, తన స్వీయ చరిత్రలో చెప్పుకొన్నారు. అందువల్ల దాదాపుగా ఇది ఓ కల్పితకథ. నరనారాయణుల మధ్య సాగిన సంఘర్షణ కథ ఇది. సృష్టి గొప్పదా, సృష్టికర్త గొప్పవాడా అనే ప్రశ్నకు సమాధానం ఈ కథ. ప్రేమలు, అభిమానాలు, ఇష్టాలు, అనురాగాలు, ఆప్యాయతల మధ్య నలిగిపోయిన వ్యక్తుల కథ ఈ గయోపాఖ్యానం. లోకంలో ధర్మం చాలా గొప్పది. ధర్మాన్ని రక్షించడం అంటే, లోకాన్ని రక్షించినట్టే. మనిషి తనను తాను రక్షించుకొన్నట్లే. తన తోటివారిని రక్షించినట్లే. అదే ఈ గయోపాఖ్యాన నాటకం అందించే అసలైన సందేశం. ధర్మరక్షణ కోసం లోకంలో ఏదైనా, దేనినైనా త్యజించాలి. అదే మనిషి కర్తవ్యం కావాలి. ఇంత గొప్పధర్మాన్ని ప్రతిష్టించింది కాబట్టే, ఈ నాటకానికి అంతటి శాశ్వతత్వం లభించింది.

-- https://rangasthalam.org/

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి