ఈరెండ

 

ఫిబ్రవరి 28, 2023

ఈరెండ     (eerenda)

    అర్థము

   (విశేష్యము): ఈరు (అల్పమైన) + ఎండ; లేత ఎండ

   Meaning

   (noun) : slight sunshine

   వాడుక / Usage

  భానుడు మబ్బు చాటునుంచి తొంగి చూడగా ఈరెండకు ఆమె చెక్కిళ్ళపై చిరుచెమట ముత్యంలా మెరిసింది.
 As the Sun peeped from the clouds a drop of sweat glistened, on her cheek, in the sunshine.    

   మెదడుకు మేత / Food for thought


వర్షోదక ముద్గిరతా శ్రవణాంతవిలంబినా కదంబేన |
ఏకస్తనో2భిషిక్తో నృపసుత ఇవ యౌవరాజస్థః ||

(చెవిలోని మొగలి పువ్వు నుండి జారిన వర్షపుచుక్కతో అభిషేకించబడ్డ ఆమె స్తనము – యౌవరాజ్య పట్టాభిషిక్తుడైన యువరాజుకు లాగా ఉంది!)

తిరుపతి వెంకటకవుల తెనిగింపు –

కలికి చెవి మీద నిరుకొన్న కడిమిపువ్వు
నుండి జాఱెడు వర్ష బిందువుల చేత
దడుపబడుచున్నదీ పయోధరము రాచ
బిడ్డ యభిషేకమొనరింప బడ్డ రీతి.

-- మృచ్ఛకటికం, శూద్రకుడు (~అయిదవ శతాబ్దం)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి