మలయిక
మార్చ్ 01, 2023
మలయిక (malayika)
అర్థము
(విశేష్యము): విహారము; వాహ్యాళి; షికారు
Meaning
(noun) : rambling; walking for pleasure; excursion
వాడుక / Usage
వరుడి బిగి కౌగిలిలో మనసు మలయింపగా మరుడి మత్తులో మురిసిపోయింది.
మెదడుకు మేత / Food for thought
అస్మాన్ సాధు విచింత్య సంమ్యమధనాన్ ఉచ్ఛైః కులంచాత్మనః
త్వైయస్యాః కథమప్యబాంధవ కృతాం స్నేహ ప్రవృత్యించతాం
సామాన్య ప్రతిపత్తి పూర్వక మిదం దారేషు దృశ్యాత్వయా
భాగ్యా యత్త మతః పరం నఖలుత ద్వాత్యం వధూబంధుభిః
(నీకన్న సంయమ ధనులము, సాధువులము అయిన మేము అన్నివిధాలుగా పెద్దలమని భావించి మేం చెప్పే ఈ మాటలు విను. మీ ఇద్దరిమధ్య ఏర్పడిన ఈ స్నేహం అబాంధవ కృతం. అంటే మేం నిర్ణయించి చేసింది కాదు. మీ ఇద్దరూ ఇష్టపడి స్వేచ్ఛితంతో చేసుకున్నది. కాబట్టి ఈమెను నీ భార్యలందరిలోనూ సామాన్య ప్రతిపత్తి పూర్వకంగా స్వీకరించు - ఈ పద్యంలో నిగూడార్థం కూడా ఉంది)
-- అభిజ్ఞాన శాకుంతలం, మహాకవి కాళీదాసు
Comments
Post a Comment