గమకము

 

ఫిబ్రవరి 03, 2023

గమకము (gamakamu)

    అర్థము

   (విశేష్యము/విశేషణము): ప్రయత్నము; నేర్పు; అధికము; మనోజ్ఞము; స్వరవిన్యాసం

   Meaning

   (noun/adj) : exertion; increase; great; pleasant; musical notes

   వాడుక / Usage

గమకమైన తమకం, గమకాలైన తరుణం ఈ ప్రణయం అతి మధురం.
Crescendo of passion, moments turning into notes, sweet nectar is this love.

   మెదడుకు మేత / Food for thought

కవుల కలాలు,గాయకుల కమ్మని కంఠము లీ సశ్మశానపుం
గవనులఁ ద్రొక్కి చూచెడి;నొకానొకనాఁడల కాళిదాస భా
రవుల శరీరముల్ ప్రకృతిరంగమునం దిపు డెంత లేసి రే
ణువు లయి మృత్తికం కలిసెనో కద! కుమ్మరి వాని సారె పై

(కవితా సుధలోలికించిన కవులకలాలు, శ్రవణాందకరమైన గాయకుల కమ్మని కంఠస్వరాలు ఇదిగో ఈ శ్మశానవాటికలో విశ్రమించాయి.పంచభౌతికమైన ఈ మేను కడకు ప్రకృతిలో కలసి పోవల్సినదే.అందులో మమైకం కావలసినదే. మట్టిలో ఖననము చెయ్యబడిన తనువు క్రమంగా కృషించి,నశించి,జీర్ణించి మట్టీలో మట్టిగా కలసిపోతుంది.మట్టిరేణువులలలో రేణువులుగా కలసిపోవును.ఔను నిక్కమే కదా!.అదిగో ఆ కుమ్మరి సారె మీదున్న మట్టిముద్దలో అల్నాటి సుకవులు కాళిదాసు,భారవుల మృతరేణువులు కలసి వున్నాయేమో కదా!)

-- శ్మశాన వాటిక, గుఱ్ఱం జాషువా (సెప్టెంబర్ 28, 1895 - 1971)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి