వ్యాజ్యము
ఫిబ్రవరి 07, 2023
వ్యాజ్యము (vyājyamu)
అర్థము
(విశేష్యము): వివాదము; తగవు; ఫిర్యాదు
Meaning
(noun) : dispute; litigation; case
వాడుక / Usage
బీబీసీ డాక్యుమెంటరీ ప్రసారంపై కేంద్రం విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాల (పిల్స్)ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
మెదడుకు మేత / Food for thought
గోదారి పొంగింది ఒకనాడు
భద్రాద్రిలో పొంగే సరయూ నదిలా
భవభూతి శ్లోకాల కరుణాకృతిలా
తలుపంత నీవున్న పంచవటి కుటీరాన
బంగారు సీతమ్మ శృంగార రామయ్య
వెలిసారని వేల్పులైనారని
రామయ్య కాళ్ళు కడిగినా
సీతమ్మ కడవ నింపినా
శ్రీ పాదాలే తాకిన క్షీర సాగరంలా
శ్రీ లక్ష్మిని తాకిన మిథిలా కేదారంలా
పొంగీ ఉప్పొంగీ ఆ నింగి గంగతో
ఏకమై పోయింది ఆనాడు
ఎల్లువై పోయింది ఈనాడు
శ్రీ రామ నవమి వచ్చినా,
చైత్రాన కుహువు పాడినా
తూము నరసింహదాస జీవనవాహినిలా,
దాశరథీశతక గానవాఙ్మయ వార్నిధిలా
పొంగీ, ఉప్పొంగీ,
శ్రీరామ చరణమే పల్లవై సాగింది ఆనాడూ..
పాటగా మిగిలిందీ ఈనాడు..
-- కవి తెలియదు
Comments
Post a Comment