పెత్తనము
ఫిబ్రవరి 08, 2023
పెత్తనము (pettanamu)
అర్థము
(విశేష్యము): పెద్ద+తనం; అధికారము; పెద్దరికం; గొప్పతనం; ముసలితనం
Meaning
(noun) : authority; rank; greatness; old age
వాడుక / Usage
ఆలయ కమిటీల్లో రాజకీయ నాయకుల పెత్తనానికి స్వస్తి పలకాలి.
మెదడుకు మేత / Food for thought
ఈ పాదం ఇలలోన నాట్య వేదం
ఈ పాదం నటరాజుకే ప్రమోదం
కాల గమనాల గమకాల గ్రంధం
ఈ పాదం !!
ఈ పాదమే మిన్నాగు తలకు అందం
ఈ పాదమే ఆనాటి బలికి అంతం
తనలోనే గంగమ్మ ఉప్పొంగగా
శిలలోనే ఆ గౌతమే పొంగగా
పాత పాటలో తను చరణమైన వేళా
కావ్యగీతిలో తను పాదమైన వేళా
గానమే తన ప్రాణమై లయలు హొయలు విరిసిన
ఈ పాదం !!
ఈ పాదమే ఆ సప్తగిరికి శిఖరం
ఈ పాదమే శ్రీ భక్త కమల మధుపం
వాగ్గేయ సాహిత్య సంగీతమై
త్యాగయ్య చిత్తాన శ్రీ గంధమై
ఆ పాదమే ఇల అన్నమయ్య పదమై
ఆ పాదమే వరదయ్య నాట్య పధమై
తుంబుర స్వర నారదా మునులు జనులు కొలిచిన
ఈ పాదం !!
-- మయూరి, వేటూరి (జనవరి 29, 1936 - 2010)
Comments
Post a Comment