సముద్యతము
మార్చ్ 02, 2023
సముద్యతము (samudyatamu)
అర్థము
(విశేషణము): ఎక్కువైనది; మిక్కిలిగా; భయంకరమైనది; పొడవైనది; పెద్ద దండము/కర్ర
Meaning
(noun/adj) : great/big; formidable; terrific; fierce; hot
వాడుక / Usage
"దళమౌ పయ్యదలోన్ అడంగియు సముద్యత్ కాంతుల్ ఈరెండాలన్ మలయింపన్ దిశలన్."
మెదడుకు మేత / Food for thought
చూశారా వదినా! మొదట్నుంచీ విధవావివాహం కూడదు కూడదు అని తప్పు అభిప్రాయంలో పడిపోయి ఉన్న అత్తగారూ మావఁగారూలాంటి పెద్దవాళ్ళకి ఎన్ని శాస్త్రాలూ మనం చెప్పినా, వాళ్ళ నెత్తి కెక్కవు. ఇలాంటి మాటలు మనం వాళ్ళతో చెప్పినట్టాయనా.. కర్రుచ్చుకుంటారు. మావఁగారు వేదం మట్టుకే చదువుకున్నారు గానీ.. నేను శాస్త్రాలు అన్నీ చదువుకొన్నాను. ఆబ్బో.. నేను మన శాస్త్రాల్లో వుడ్డోలుణ్ణి. శాస్త్రకారుడు ఏవఁన్నాడూ? 'బాలాదపి సుభాషితం' అన్నాడు. అనగా మంచిమాట చంటిపిల్లడు చెప్పినా విని ఆ ప్రకారం చెయ్యాలయ్యా అన్నాడు.
-- కన్యాశుల్కం లో గిరీశం, గురజాడ అప్పారావు (సెప్టెంబర్ 21, 1862 - 1915)
Comments
Post a Comment