లేమ

 

మార్చ్ 13, 2023

లేమ     (lēma)

    అర్థము

   (విశేష్యము/విశేషణము): మగువ; స్త్రీ; వనిత; లేత

   Meaning

   (noun/adj) : a woman; tender; young

   వాడుక / Usage

లేముల యందు గౌరవ లేమి ఉన్న  సంఘము పురోగమించదు.
A society which lacks respect for women cannot progress.

   మెదడుకు మేత / Food for thought

లేమా! దనుజుల గెలువఁగ
లేమా? నీ వేల కడఁగి లేచితి? విటు రా
లే మాను మాన వేనిన్
లే మా విల్లందికొనుము లీలం గేలన్

(భామా! మేము రాక్షసులను గెలువలేమా? నీ వెందుకు యుద్ధానికి సిద్ధపడ్డావు? ఇలా రా! యుద్ధ ప్రయత్నం మానుకో. మాననంటావా, అయితే విలాసంగా నీ చేత్తో ఈ విల్లందుకో!) (యమకాలంకారం)

-- ఆంధ్ర మహాభాగవతం, పోతన (1450 - 1510)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి