చుక్కాని

 

మార్చ్ 14, 2023

చుక్కాని     (chukkāni)

    అర్థము

   (విశేష్యము): తెడ్డు; పడవను నడిపే లేక దిక్కు మరలించే పరికరం

   Meaning

   (noun) : oar; rudder; helm

   వాడుక / Usage

"ఓ... చుక్కా నవ్వవే.. నావకు చుక్కానవ్వవే".
O mademoiselle ! dear give me a smile..steer me a nautical mile.

   మెదడుకు మేత / Food for thought

కన్నీటికి కలువలు పూసేనా... కాలానికి ఋతువులు మారేనా...
మబ్బులెంతగ కురిసినా ఆకాశం తడిసెనా
మాటలతో మరపించినా.. మనసున వేదన తీరెనా..
విధి శోధన ఆగెనా...

కన్నీటికి కలువలు పూసేనా... కాలానికి ఋతువులు మారేనా...

తనువే గాయాల గానమురళీ.. ఐనా మది మౌనరాగ రవళి
ఉరిమే మేఘాలు చూసి కదిలి మెరిసే ఫించాలు విప్పె నెమలి
పాటలెన్ని పలికించినా కంటికి జోలగ మారేనా..
ఎదగోలలు ఆగేనా..

కన్నీటికి కలువలు పూసేనా... కాలానికి ఋతువులు మారేనా...

మృతిలో తలదాచుకున్న బ్రతుకు
శ్రుతిలో కలిపింది నిన్ను జతకు
గుడిలో దైవాలు ఎందుకొరకు విధితో పొరాడు జంటకొరకు
పొద్ధులెన్ని ఉదయించిన రేపటి చీకటి తీరేనా
ఎడబాటిక ఇంతేనా..

కన్నీటికి కలువలు పూసేనా... కాలానికి ఋతువులు మారేనా...
మబ్బులెంతగ కురిసినా ఆకాశం తడిసెనా
మాటలతో మరపించినా.. మనసున వేదన తీరెనా..
విధి శోధన ఆగెనా...


(దృష్టాంతాలంకారం)


-- మాతృదేవోభవ, వేటూరి సుందరరామమూర్తి (జనవరి 29, 1936 - 2010)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి