నిగళము
మార్చ్ 17, 2023
నిగళము (nigaḷamu)
అర్థము
(విశేష్యము): సంకెల; ఏనుగు కాలి సంకెల; అన్నవాహికలో గళము తరువాతది
Meaning
(noun) : confine; chain; elephant fetter; oesophagus
వాడుక / Usage
మెదడుకు మేత / Food for thought
రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో
రవి చూడని పాడని నవ్య రాగానివో
రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో
ఏ రాగమో తీగదాటి ఒంటిగా నిలిచే
ఎ యోగమో నన్ను దాటి జంటగా పిలిచే
ఏ మూగ భావాలో అనురాగ యోగాలై
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీ పాటనే పాడనీ
రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో
ఏ గగనమో కురుల జారి నీలిమై పోయే
ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమై పోయే
ఆ కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలై
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కదలాడనీ పాడనీ
(అతిశయోక్తాలంకారము: వర్ణనను అతిశయంగా చెప్పడం, ఉపమాన ఉపమేయాల్లో ఉపమానాన్ని చెప్పి రెండోదాన్ని ఊహకి వదిలెయ్యడం ఈ అలంకార లక్షణం)
-- రావణుడే రాముడైతే, వేటూరి (జనవరి 29, 1936 - 2010)
Comments
Post a Comment