మార్చ్ 20, 2023
ఉదాత్తము (udāttamu)
అర్థము
(విశేష్యము/విశేషణము): ఎత్తైనది; గౌరవము కలది; దానము; వేదములో ఊర్ధ్వ స్వరం; అలంకారాల్లో ఒకటి
Meaning
(noun/adj) : glorious; great; elevated; quaver in Veda chanting; high or sharp tone
వాడుక / Usage
హాస్యకథా రచయత మునిమాణిక్యం నరసింహారావు మానవతా విలువలతో ఉదాత్తమైన కథలు వ్రాసారు.
Munimanikyam Narasimha Rao penned humorous stories with great human values.
మెదడుకు మేత / Food for thought
ఓరి గాడిద, నేను సన్యాసం పుచ్చుకోటానికి వెళ్తున్నానురా! నేను పుచ్చుకుంటాను నాన్న అన్నాడు మా అయిదేళ్ల వెధవ. నేనో నాన్న అంటూ బిక్కమొహం వేసింది సుశీ. ఈ చిన్న వెధవలంతా నాతో సన్యాసం పుచ్చుకోడానికి బయలుదేరారు. బుద్ధ దేవుడికే, ఒక్క కొడుకే కాబట్టి తెంచుకుని పారిపోయినాడు. అదీ నిద్రపోతున్నప్పుడు. అదీ అర్థరాత్రి! అసుర సంధ్య వేళ అర డజను పిల్లల్ని వదిలించుకు వెళ్ళ వలిసి వచ్చినట్లైతే తెలిసేది - ఈ సంసారానికి మానవుడు ఎలా కట్టుబడి ఉన్నాడో!....సుశీని ఒక చేత్తో ఎత్తుకుని వెనక్కి వచ్చి తలుపు కొట్టాను. అణిచి పెట్టుకున్న నవ్వు ముఖంతో కాంతం తలుపు తీసి "ఎందుకు మళ్ళీ వచ్చారు అంది?"
మరి వీళ్లంతా? ఈ మాత్రం జయించలేని వాళ్ళు లోకాన్ని ఉద్ధరించడానికి బయలుదేరారు. నిజమేలే అన్నాను. "ఉహు ఒప్పుకోండి ఓడి పోయానని." సర్లే ఓడిపోయాను. కిలకిలా నవ్వుతూ లోపలికి రానిచ్చి ధభీమని తలుపు వేసింది.
-- కాంతం కైఫీయత్, మునిమాణిక్యం నరసింహారావు (మార్చ్ 15, 1898 - 1973)
Comments
Post a Comment