కలితము

 

మార్చ్ 03, 2023

కలితము     (kali-tamu)

    అర్థము

   (విశేషణము): కలిగిన; పొందబడినది; కూడినది

   Meaning

   (adj) : having; possessed of 

   వాడుక / Usage

 పదోన్మత్త కలితమై ప్రభుత్వం ప్రవర్తించగా ప్రశ్నించే విలేఖరి లేక ప్రజాస్వామ్యం మట్టుపట్టింది.
 Government drunk on power, questioning journalist disappearing, democracy demolished.    

   మెదడుకు మేత / Food for thought

ఓయీ బ్రహ్మదేవుడా! దివ్యస్థలంబగు తిరుపతి కొండను 
కోతి మూకను బాదు కొలిపినావు
తత హంసతూలికా తల్పంబునందును 
చెడు నల్లులను సృష్టి చేసినావు
ప్రీతి నింపేడు గులాబీ చెట్టునకు 
వాడి మించెడి ముండ్లు సృజించినావు
ప్రభువుల మందిర ప్రాంగణంబుల 
మూర్ఖవేత్ర హ్రస్తులను కల్పించినావు
సౌఖ్యముల కాకరములైన సాని యిండ్ల 
విటుల నెత్తురు పీల్చెడు 
వేశ్యమాతలను మహా పిశాచముల 
గావుంచినావు గదరా వృథగాను
నీ తెల్వి కాలిపోను

-- భవానీ పద్యాలు, చింతామణి నాటకం, కాళ్ళకూరి నారాయణ రావు (ఏప్రిల్ 28, 1871 - 1927)

Comments