అభ్రము

 

మార్చ్ 21, 2023

అభ్రము    (abhramu)

    అర్థము

   (విశేష్యము): ఆకాశం; మబ్బు; బంగారం; అభ్రకం; హారతి కర్పూరం; సున్నా

   Meaning

   (noun) : sky; cloud; gold; mica; camphor; zero

   వాడుక / Usage

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై నల్లని అభ్రమాలు కమ్ముకుంటున్నాయి.
Dark clouds are gathering over the global financial systems.

   మెదడుకు మేత / Food for thought

వగలమారి గాలి ఉన్నట్టుంద్డి వాటం మార్చుకుంటుంది. నీళ్ళ గుప్పిళ్ళను దాచుకున్న తెమ్మెరలు జివ్వున ముఖాలను తాకి ఆటగా నవ్వుతుంటాయి. తుమ్మెదలన్నీ ఎగిరి సంతోషకరమైన కబురేదో పంచుకోవడాని కన్నట్టు దగ్గరగా కూడుతాయి. ఆకాశాన ఒక నల్లటి మేఘం రూపుగట్టి ఆశీస్సులై కురవడానికి నేలకు దగ్గరగా జరుగుతుంది. జగత్తంతా పరవశించే ఆ క్షణాన ప్రకృతి మురిపెంగా ఒక పాటను ప్రసవిస్తుంది.

ఠండి హవా కాలి ఘటా ఆహి గయీ ఝూమ్ కే

ప్యార్ లియే డోలె హసీ నాచ్ జియా ఘూమ్ కే

హిందీ సినిమా సంగీతంలోకి గీతారాయ్ ఠండీ హవాలాగా, కాలీ ఘటాలాగా ప్రవేశించింది. పలుచటి ముఖం, దయగా నవ్వే పెదాలు, కరుణ కురిపించే పెద్ద పెద్ద కళ్ళు, పాట తన దగ్గర ఉన్నందుకు కృతజ్ఞతాపూర్వకంగా వచ్చిన వినయం…’

మన్ చాహే గీత్ - పాటలు ప్రసిద్దుల పరిచయాలుమహమ్మద్ ఖదీర్ బాబు

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి