ప్రత్యగ్రము

 

మార్చ్ 22, 2023

ప్రత్యగ్రము    (praty-agramu)

    అర్థము

   (విశేషణము): నూతనము; పరిశుద్ధము; క్రొత్త

   Meaning

   (adj) : new; pure; fresh; recent

   వాడుక / Usage

ప్రతి క్షణం ప్రత్యేకం, ప్రతి దినం ప్రత్యగ్రం, నిన్నటి హద్దులు దాటి నేటి సరిహద్దులు మీరి నవయుగానికి నాంది పలుకు.
Every moment is special, every day is new; break the confines of yesterday, cross the boundaries of today and herald a new era.

   మెదడుకు మేత / Food for thought

తెలకపిండి యెట్లా వస్తుందో అందరికీ తెలుసు. నువ్వులు అట్టే నాగరికత లేని సరుకు. అది పొలాల్లో కష్టజీవుల చేతుల్లో పెరిగి మధ్యతరగతి వాళ్ళకు అమ్ముడుపోయి బస్తీ చేరుతుంది. అక్కడ దాన్ని గానుగ ఆడి నూనె తీస్తారు. ఆ నూనె అందమైన సీసాలకూ, డబ్బాలకూ యెక్కి అనేక వంటిళ్ళను అలంకరిస్తుంది. తెలకపిండి చెక్కను నువ్వులొకవేళ చూసినా పోల్చుకోలేవు. అది గొడ్లకూ, పేదవాళ్ళకూ ఆహారమవుతుంది. నువ్వులు గానుగాడటం యేమంత గొప్ప విషయం కాదు. నేను మనుషుల్ని గానుగాడగా చూసాను. ఎందుకనో నాకా పద్ధతి రుచించలేదు.

-- నువ్వులు-తెలకపిండి, కొడవటిగంటి కుటుంబరావు (అక్టోబర్ 28, 1909 - 1980)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి