జీమూతము
మార్చ్ 24, 2023
జీమూతము (jī-mūtamu)
అర్థము
(విశేష్యము): మబ్బు; కొండ; డావరడంగి (విషమునకు విరుగుడు)
Meaning
(noun) : cloud; hill; a poison antidote
వాడుక / Usage
మెదడుకు మేత / Food for thought
పిల్లలకీ మేస్టార్లకీ మా అమ్మమ్మ నెత్తిమీద దేవత. వాళ్ళు గౌరవిస్తున్న కొద్దీ చనువు ఎక్కువయింది. అన్నిటా తలదూర్చడం ప్రారంభించింది.
ఒకరోజు దక్షిణం వైపు కూర్చుని అరటి దూట తరుక్కుంటోంది. పక్కన స్కూల్లో సోషల్‌మాస్టారు రామతారకంగారు పాఠం చెబుతున్నారు.
"మనదేశమును ఎందరో రాజులు పాలించిరి. అశోకుడు పాలిచ్చెను, హర్షవర్ధనుడు పాలిచ్చెను, చించిసారుడు పాలిచ్చెను" అంటూ దీక్షగా చెప్పుకుపోతుంటే అమ్మమ్మ "రామతారకంగారూ, ఇట్రండి. ఇందాకటి నుంచి వింటున్నాను. ఆ రాజు పాలిచ్చాడు, ఈ రాజు పాలిచ్చాడు అంటున్నారు. పాలివ్వడానికి వారేమయినా పాడిపశువులా?" అని అడిగింది.
ఆయన తడబడిపోయి, "అదికాదండీ పెద్దమ్మగారూ, పరిపాలించారు అని చెప్తున్నా" అన్నాడు.
"బాగానే ఉంది. మీరు వినలేదేమో! మొన్న దేవుడి గుళ్ళో వరికూటి జయమ్మగారు హరికథ చెబుతూ ఫలానా చక్రవర్తి ఫలాని నగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యమేలినారు అని ఎంత స్పష్టంగా చెప్పిందో! మీరూ అలాగే చెప్పొచ్చుగా. పాలిచ్చారు, పెరుగిచ్చారు అని సొంత కవిత్వం ఎందుకూ?" అంది.......
-- పొత్తూరి విజయలక్ష్మి
Comments
Post a Comment