నిబద్ది

 

మార్చ్ 27, 2023

నిబద్ది    (nibaddi)

    అర్థము

   (విశేష్యము/విశేషణము): నిజం; సత్యం; పరమార్థం

   Meaning

   (noun/adj) : truth; certainty; reality

   వాడుక / Usage

సామజిక మాధ్యమాల్లో వచ్చే అబద్ధపు వార్తల వల్ల నిబద్దమైన సమాచారం కనుమరుగైంది.
Truth has become buried under the tsunami of falsities on Social Media.

   మెదడుకు మేత / Food for thought

అన్నిటికన్నా ముఖ్యం - నిన్ను నువ్వు అబద్దాలతో మోసపుచ్చుకోకు. తనకు తాను అసత్యాలు చెప్పుకుని వాటినే నమ్మే వారు తమలోని నిజాన్ని కానీ చుట్టుపక్కల ఉన్న నిజాన్ని కానీ గుర్తించే సామర్థ్యం కోల్పోతారు. దానితో తనమీద తానే గౌరవం కోల్పోడమేగాక మిగతావారినీ గౌరవించలేరు. గౌరవం లేని చోట ఆ కారణంగా ప్రేమ వాత్సల్యం కూడా లోపిస్తాయి.

-- బ్రదర్స్ కరంజోవ్, ఫయోడోర్ దస్తయేవస్కీ (నవంబర్ 11, 1821 - 1881)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి