పార్శ్వము

 

మార్చ్ 28, 2023

పార్శ్వము    (pārṣvamu)

    అర్థము

   (విశేష్యము): ప్రక్క; సమీపం; వస్తువు/శరీరం యొక్క (పక్కనుండే) భాగము; 

   Meaning

   (noun) : a side/part; flank; nearby

   వాడుక / Usage

జీవితపు చీకటి పార్శ్వము తనని నీడలాగా వెంటాడుతూనే ఉంది.
The dark side of life shadowed him constantly.

   మెదడుకు మేత / Food for thought

ఎందుకు మనం క్షిణించిపోతాం? ఎంతో ఉత్సాహంగా, ధైర్యంగా, నైతికంగా, నమ్మకంతో బయలుదేరిన మనం ఎందుకు ముప్పై లేక ముప్పై అయిదు వచ్చేప్పటికి అన్నీ కోల్పోయి విహీనంగా తయారు అవుతాము? ఒకళ్ళు మితిమీరిన ధనార్జనలో సమిసిపోతే, మరొకరు తన తలలో తానే తూటా దింపుకుంటే, ఇంకొకరు మద్యం మత్తులో ముగిసిపోతే, వేరొకరు భయాందోళనలు కప్పిపుచ్చడానికి తన మునుపటి అందమైన వ్యక్తిత్వాన్ని వికృతంగా కాళ్ళకింద తొక్కి వేస్తున్నారు. ఎందుకు? ఎందుకు ఒకసారి దిగజారి పోయాక, మళ్ళీ నిలబడడానికి ప్రయత్నించం? ఒకటి పోగొట్టుకున్నాక మరొకటి సాధించడానికి యత్నించం? ఎందుకు?

-- అంటోన్ చెఖోవ్ (జనవరి 29, 1860 - 1904)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి