రేడు
మార్చ్ 16, 2023
రేడు (rēḍu)
అర్థము
(విశేష్యము): రాజు; దొర; భర్త; అధిపతి
Meaning
(noun) : master; king; husband
వాడుక / Usage
మెదడుకు మేత / Food for thought
సప్తాహంబులు శైలరాజము లసచ్ఛత్త్రంబుగాఁ దాల్చి, సం
గుప్తప్రాణులఁ జేసె మాధవుఁడు గోగోపాలకవ్రాతమున్
సప్తాంభోధి పరీతభూధరున కాశ్చర్యంబె చింతింపఁగన్
(అర్థాంతరన్యాసము: శ్రీకృష్ణుడు ఏడేళ్ళ బాలుడై ఉన్నా ఏడు రోజుల పాటు స్తంభములాంటి తన భుజముపై అలవోకగా శ్రేష్ఠమైన శైలము గోవర్థనగిరిని ఓ ప్రకాశించే గొడుగులాగ ఎత్తి పట్టుకున్నాడు. గోవులను గోపాలకులను దాని మరుగున దాచి అందరి ప్రాణాలను రక్షించాడు. సప్తసముద్రాలతో చుట్టబడి ఉండే భూమి నంతటిని ధరించిన ఆ పరమపురుషునికి ఇది వింత పనేం కాదు)
-- ఆంధ్ర మహాభాగవతం, బమ్మెర పోతన (1450 - 1510)
Comments
Post a Comment