ఉద్విగ్నము

 

మార్చ్ 30, 2023

ఉద్విగ్నము    (ud-vignamu)

    అర్థము

   (విశేషణము): భయమొందినది; వ్యాకుల చిత్తము; మనసు కుదురులేనిది; కలవరము;  

   Meaning

   (adj) : disturbed; anxious; sorrowful 

   వాడుక / Usage

"సోమవారం ఉదయం మన భారతావని కొద్ది సేపు చాలా ఉద్విగ్నంగా గడిపింది."
Monday morning India was gripped with anxiety for some time.

   మెదడుకు మేత / Food for thought

జీవితం యొక్క చిక్కుముడులు గురించి ఆలోచించావా? వింటానంటే ఇప్పుడే చెప్తా. మాయాభరితమైన వాటి వెంట పడకు - అంటే సంపత్తి మరియు హోదా కోసం ప్రాకులాడకు. నువ్వు ప్రతి కణం ధారపోసి వాటిని పోగేసినా ఒక్క గొడ్డలివేటుతో అవి నీ నుంచి దూరం చేయబడతాయి. జీవితం మీద ఒక నిశ్చల ఆధిక్యతతో జీవించు. కష్టాలకు భయపడకు, సుఖాలను ఆశించకు. అవి రెండూ చివరకి ఒకటే కదా! చేదు అంతులేకుండా నిల్చిపోదు, తీపి సదా పొంగేలా ఉండిపోదు. చలిలో గడ్డకట్టకుండా, ఆకలి దప్పికలు పొట్టని ఉండలు చుట్టకుండా ఉంటే అది చాలు. నడుము విరగకుండా, పాదాలు నడుస్తుండగా, చేతులు వంచగలిగితే, కళ్ళు చూస్తుంటే, చెవులు వింటుంటే, ఇంకెవర్ని చూసి అసూయపడాలి? ఎందుకు పడాలి? అసూయ అందరికన్నా ఎక్కువ మనల్ని కబళించి వేస్తుంది. కళ్ళు తుడుచుకో మనస్సు పునీతం చేసుకో.

-- ది గులాగ్ ఆర్చిపెలాగో, అలెగ్జాండర్ సోల్జెనిట్సిన్ (డిసెంబర్ 11, 1918 - 2008)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి