ఆచ్ఛాదనము
మార్చ్ 31, 2023
ఆచ్ఛాదనము (āchchādanamu)
అర్థము
(విశేష్యము): కప్పుట; తప్పులను కప్పిపుచ్చడం; వస్త్రము
Meaning
(noun) : cover; covering; cloak; clothes
వాడుక / Usage
మెదడుకు మేత / Food for thought
ప్రేమించు...కానీ దేనికోసమో ప్రేమించే ప్రేమ కాదు, ఎదో ఆశించే ప్రేమ కాదు, దేనివలనో ప్రేమించే ప్రేమ కాదు...నా ఆఖరి క్షణాల్లో మొదటిసారిగా నేను అనుభవించిన ప్రేమ ప్రేమించు, శత్రువుని చూసాను కానీ ప్రేమించాను, అలా ప్రేమించు. ఆత్మపరమైన ఆ ప్రేమకి ఏ వస్తువు ఏ లక్షణం అవసరం లేదు. ఆ సచ్చిదానందం నాకు ఇప్పటికీ గుర్తు ఉంది. నీ చుట్టు పక్కన వాళ్ళని ప్రేమించడం, నీ శత్రువులను ప్రేమించడం, అందరినీ అంతటినీ ప్రేమించడం - దైవ స్వరూపాలైన సర్వప్రాణకోటిని ప్రేమించడం. మనకు ఇష్టమైన వాళ్ళని మానవీయంగా ప్రేమించగలం. కానీ శత్రువుని కేవలం దైవికమైన ప్రేమతోనే ప్రేమించగలం. మానవీయమైన ప్రేమ, ప్రేమ నుంచి ద్వేషంగా మారచ్చు కానీ దైవిక ప్రేమ మారదు మారలేదు. మృత్యువు కూడా దానిని అంతమొందించలేదు. అది ఆత్మ తత్వం.
-- వార్ అండ్ పీస్, లియో టాల్‌స్టాయ్ (సెప్టెంబర్ 09, 1828 - 1910)
Comments
Post a Comment