బణువు
మార్చ్ 06, 2023
బణువు (banuvu)
అర్థము
(విశేష్యము): బహుళమైన/బృహత్ అణువు; అణువుల సమూహానికి ~1968లో వాడుకలోకి వచ్చిన పదం
Meaning
(noun) : molecule
వాడుక / Usage
రెండు ఉదజని అణువులు, ఒక ఆమ్లజని అణువు సంయోగం చెందితే వచ్చేది నీటి బణువు.
మెదడుకు మేత / Food for thought
దరికి చేరినపుడే నా జీవితం నీ చెంత
ధరణి మైమరిపించెనే అందాల నెలవంక
ముద్ద మందారాల ముగ్ధ సువాసనతో మది చెలరేగెనే
మలి సంజె వేళలో నీ గళ సెలయేటి పిలుపులే
ఘాడమైన గురుతులు ఇపుడు, నిగూఢమైన సంగతులు అపుడూ
ఝాము రాతిరి నిదుర పట్టనీయవే నాకింకెపుడూ
కలిసిన ప్రతిసారీ ఎడబాటి కాటు ఎందులకే
విరిసిన ప్రతి నిమీషం నీ విరహం దహిస్తోంది అందులకే
-- జిందగీ జబ్ భీ తేరి బజ్మ్ మే లాతి హై హమే, శహర్యార్, (జూన్ 16, 1936 - 2012)
Comments
Post a Comment