అంకణము
మార్చ్ 07, 2023
అంకణము (ankaṇamu)
అర్థము
(విశేష్యము): నలుచదరపు చోట (12 x 6 అడుగులు); రెండు స్తంభముల మధ్య ప్రదేశం; కక్ష్య; ప్రాంగణం; పెరడు
Meaning
(noun) : apartment; courtyard; place between two pillars/beams
వాడుక / Usage
లంకంత అంకణం ఉంటేనేమి రవ్వంత మానవత్వం లేని చోట.
మెదడుకు మేత / Food for thought
ఎంత చీకటి కాల్చెనో ఇంత చల్లని తారక
ఎంత వెలుగును పంచెనో ఇంత సన్నని దీపిక
కాలమేమో బరువు బరువు కంటికేమో నిదుర కరువు
ఎంత చేదుని మింగెనో ఇంత తీయని కోరిక
సూది పోట్లకు గుండె సాచి బాధలకు భాష్యాలు వ్రాసి
ఎంత కీర్తిని మోసెనో ఇంత మెత్తని మాలిక
కాంక్షలేమో కదలి పోగా ఆంక్షలెన్నో ఎదురు రాగా
ఎంత ఓర్పును వహించెనో ఇంత తీరని వేడుక
మంచు దాడులు జరుగుతున్నా మండుట్టెండలు రగులుతున్నా
ఎంత మట్టిని పీల్చెనో ఇంత పచ్చని వాటిక
ఏరు దాటితే ఎవరు వారే ఏమి లోకం ఓ సినారె
ఎంత నటన భరించెనో ఇంత పల్చని జీవిక
ఎంత వెలుగును పంచెనో ఇంత సన్నని దీపిక
కాలమేమో బరువు బరువు కంటికేమో నిదుర కరువు
ఎంత చేదుని మింగెనో ఇంత తీయని కోరిక
సూది పోట్లకు గుండె సాచి బాధలకు భాష్యాలు వ్రాసి
ఎంత కీర్తిని మోసెనో ఇంత మెత్తని మాలిక
కాంక్షలేమో కదలి పోగా ఆంక్షలెన్నో ఎదురు రాగా
ఎంత ఓర్పును వహించెనో ఇంత తీరని వేడుక
మంచు దాడులు జరుగుతున్నా మండుట్టెండలు రగులుతున్నా
ఎంత మట్టిని పీల్చెనో ఇంత పచ్చని వాటిక
ఏరు దాటితే ఎవరు వారే ఏమి లోకం ఓ సినారె
ఎంత నటన భరించెనో ఇంత పల్చని జీవిక
-- డా. సి. నారాయణ రెడ్డి (జులై 29, 1931 - 2017)
Comments
Post a Comment