భేషజము
మార్చ్ 08, 2023
భేషజము (bhēshajamu)
అర్థము
(విశేష్యము): మందు; ఔషధము; మోసము; డంబము; ఆర్భాటము
Meaning
(noun) : medicine; treatment; deceit; show off
వాడుక / Usage
మనసులోని ఆలోచనలను ఎటువంటి భేషజం లేకుండా చెప్పేవారు అరుదు.
మెదడుకు మేత / Food for thought
ప్రతిది సులభముగా సాధ్యపడదు లెమ్ము,
నరుడు నరుడౌట యెంతో దుష్కరమ్ము సుమ్ము
వేరులోనుండి కొమ్మలు వెలసినట్లు
అన్నిశబ్దాలు నిశ్శబ్దమందె పుట్టె
స్వీయలోపమ్ము లెరుగుట పెద్ద విద్దె
లోప మెరిగినవాడె పూర్ణుడగు నరుడు
పత్రమున నగ్ని శిఖ భద్రపరుచవచ్చు,
హృదయమున దుఃఖబాధ భరించలేము
ఈ జగత్తు స్వభావమ్ము నేమియందు!
మంచి చేసిన వానిని ముంచు నౌర!
సింధువునుజేరి బిందువు సింధువగును
ధ్యేయమునుబట్టి ప్రతిపని దివ్యమగును
ధ్యేయమునుబట్టి ప్రతిపని దివ్యమగును
-- గాలిబ్ గీతాలు, దాశరథి కృష్ణమాచారి (జులై 22, 1927 - 1987)
Comments
Post a Comment