భిషక్కు

 

మార్చ్ 09, 2023

భిషక్కు     (bhishakku)

    అర్థము

   (విశేష్యము): వైద్యుడు

   Meaning

   (noun) : doctor; physician

   వాడుక / Usage

'ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజము' వ్యావహారిక భాషోద్యమంలో గిడుగుగారి రచన.
"Telugu doctor of letters' bluster" is a book written by Gidugu Ramamurthy.

   మెదడుకు మేత / Food for thought


నీ గురుతులే వచ్చెనే రాతిరి అంతా
నీరోడిన కళ్ళే నవ్వెనే రాతిరి అంతా

రేతిరి అంతా విరహాగ్ని మండుతూనే ఉన్నదే
వ్యథల జ్వాల చెలరేగిందే రాతిరి అంతా

మురళీ గానం మధురమై మనోహరమైనే సదా
జ్ఞాపకాలు గునపాలై గుచ్చెనే రాతిరి అంతా

తలపుల చందమామ మనసున వెలిసెనే
వెన్నెల విరజిమ్మేనే రాతిరి అంతా

ప్రేమపిపాసి ఎవరో వీధులలో తిరిగేనే
విరహ గీతం వినవడెనే రాతిరి అంతా

-- ఆప్ కీ యాద్ ఆతి రహీ రాత్ భర్, మగ్దూం మొహియుద్దీన్ (ఫిబ్రవరి 04, 1908 - 1969)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి