మడిగె
మార్చ్ 10, 2023
మడిగె (madige)
అర్థము
(విశేష్యము): దుకాణము; కొట్టు; అంగడి;
Meaning
(noun) : shop; room set aside for commerce
వాడుక / Usage
మెదడుకు మేత / Food for thought
చేట్టుకేమో విత్తుకు ఋణమున్నది..తెలియలేదు
నాకేమో నాన్న విలువ ఎంతన్నది.. తెలియలేదు
నాకేమో నాన్న విలువ ఎంతన్నది.. తెలియలేదు
నాన్న నాకు చొక్కా తొడగటమే తెలిసింది గానీ…
కనిపించని కవచమొకటి కడుతున్నది తెలియలేదు
కనిపించని కవచమొకటి కడుతున్నది తెలియలేదు
ముద్దులాడి నన్ను పైకి ఎగరేయుట తెలుసు గానీ..
తనకన్నా ఎత్తున నిలపెడుతున్నది తెలియలేదు
తనకన్నా ఎత్తున నిలపెడుతున్నది తెలియలేదు
చేయి పట్టి నాన్న నడిపించుట తెలుసు గాని..
నా యాత్రకు శ్రీకారం చుడుతున్నది తెలియలేదు
నా యాత్రకు శ్రీకారం చుడుతున్నది తెలియలేదు
ఈతకొరకు నన్ను నీట నెట్టడమే తెలుసు గానీ
నా తెగువకు ఉగ్గు పాలు పడుతున్నది తెలియలేదు
నా తెగువకు ఉగ్గు పాలు పడుతున్నది తెలియలేదు
ఏమి తండ్రి రెంటాల..కన్నీళ్లను కూడ దాచి..
నాకై చెమటగా ఖర్చుపెడుతున్నది తెలియలేదు…
నాకై చెమటగా ఖర్చుపెడుతున్నది తెలియలేదు…
నా జీవం నా సారం చీల్చి చూసుకొంటే గాని..
నాన్న ఇలా నేనై జీవిస్తున్నది తెలియలేదు..
నాన్న ఇలా నేనై జీవిస్తున్నది తెలియలేదు..
చేట్టుకేమో విత్తుకు ఋణమున్నది..తెలియలేదు
నాకేమో నాన్న విలువ ఎంతన్నది.. తెలియలేదు…
నాకేమో నాన్న విలువ ఎంతన్నది.. తెలియలేదు…
-- రెంటాల శ్రీ వెంకటేశ్వర రావు
Comments
Post a Comment