ఆయత్తము
మార్చ్ 29, 2023
ఆయత్తము (āyattamu)
అర్థము
(విశేషణము): సిద్ధము; జాగురూకము; ప్రయత్నించు; ఆధీనము; వశ్యము
Meaning
(adj) : ready; preparation; submitted to
వాడుక / Usage
మెదడుకు మేత / Food for thought
కోరికలు పాతిపెట్టడం కోసం జీవించాను
కలలు తుప్పుతో మకిలబడటం చూసాను
ఇప్పుడు మిగిలిందంతా ఫలించని జ్వాలలు
ఎడారి వంటి హృదయాన్ని కాల్చే నిప్పు రవ్వలు
పెనుతుఫానులోని కారుమబ్బులా విధి ఢీకొంది
మధుమాసపు నా ఆశా కిరీటాన్ని ఎండగట్టింది
ఒంటరినై నిస్పృహతో వీక్షించాను వేచాను
తుదిపిలుపు కోసం ఎదురుతెన్నులు కాచాను
వెన్నెముకలో వణుకు తెచ్చే ఆ చివరాఖరి చల్లని గాలిగా
శీతాకాలం వీచే పవనంలో ఈల వేయగా
మోడుపోయిన చిటారు క్రొమ్మపై ఒంటరిగా
కంపిస్తూ మిగిలిపోయింది ఒక ఆకు కొనకు వ్రేళ్ళాడగా
-- అలెగ్జాండర్ సెర్గెయెవిచ్ పుష్కిన్ (జూన్ 6, 1799 - 1837)
Comments
Post a Comment