తారతమ్యము

 

ఏప్రిల్ 11, 2023

తారతమ్యము    (tāra-tamyamu)

    అర్థము

   (విశేష్యము): తరతమ (తక్కువ ఎక్కువ) భావము; అంతరము; భేదము; రెండు రాసుల మధ్య సంబంధం

   Meaning

   (noun) : comparison; difference; relative value

   వాడుక / Usage

ఆలోచన అందరూ చేసే ఒక మానసిక వ్యాపారం, కానీ దానిలో తారతమ్యాలు ఉన్నాయి.
Thinking is everyone's vocation but there are relative differences.

   మెదడుకు మేత / Food for thought

జోకులాష్టమినాడు పుట్టాట్ట ముళ్ళపూడి వెంకటరమణ గారు. నవ్వుల పువ్వుల వెనుక మనసుని కుదిపే మాంసపు ముడులున్నాయి గనుకనే 'ముళ్ళపూడి' హాస్య రచనలలో మొగలి పొత్తుల స్పర్శ ఉంటుంది. వేలాది సొంతమాటల్ని జాతీయం చేసిన అభ్యుదయవాది. కొత్తటానిక్కు వంటబట్టక 'సాక్షి' గల్లా తన్నేసినా, స్క్రిప్టు వదలని విక్రమార్కుడిలా నిలిచి, నేడు ముగ్గులో ముత్యాలేరుతూ ఎంచక్కా వడ్డీతో సహా జమ వేసుకుంటున్నారు.
-- వెంకటరమణీయం, శ్రీ రమణ పేరడీలు

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి