మువ్వీసము
ఏప్రిల్ 12, 2023
మువ్వీసము (muv-vīsamu)
అర్థము
(విశేష్యము): మూడు వీసములు; వీసము=పదహారవ భాగము;
Meaning
(noun) : three sixteenths
వాడుక / Usage
మెదడుకు మేత / Food for thought
లెక్కకు మించిన రెక్కలు వున్నా
గులాబీ పువ్వొకటేనన్నా
మన దేశం ఒకటే అయినా
కులమత భేదాలెన్నో? ఎన్నో?
వికసించిన పువ్వుకు రెక్కలు
విహరించే పక్షికి రెక్కలు
ప్రతిమనిషికి వున్నవి రెక్కలు
రెక్కలు కలిపిన వుండవు చిక్కులు
రెక్క లాడినా డొక్కలు పూడవు కొందరికి
డొక్కలునిండీ రెక్కలాడవు కొందరికి
వికసించిన గులాబీరేకులు
చైతన్యపు సంకేతాలు
అటపొంచిన గులాబీముళ్ళు
గురిపెట్టిన తుపాకీ గుళ్ళు
-- కాళోజీ గొడవ, గులాబీ పై కాళోజి, శ్రీ రమణ పేరడీలు
Comments
Post a Comment