చాపల్యము

 

ఏప్రిల్ 14, 2023

చాపల్యము    (chā-palyamu)

    అర్థము

   (విశేష్యము): నిలకడ లేని స్థితి; లోలత్వము; చంచలం;  

   Meaning

   (noun) : fickleness; whimsical

   వాడుక / Usage

చింత చిగురు - పప్పు, కూర, పనస పిక్కల కూర - జిహ్వ చాపల్యాన్ని తీర్చేవే.
Tender tamarind leaves - dal, curry or with jackfruit seeds - tickle the fickle tongue.

   మెదడుకు మేత / Food for thought

'గోదా శబరి' నది అనే మాట గోదాబరి అయి, గోదావరి అయి కాలక్రమంలో 'గోదారి' అయింది. అంటే క్లుప్తతను నేటి ఆధునికుడు సమాదరిస్తున్నాడన్నమాట. తెలుగు కవితల్లో ఆంగ్లపదాలు విరివిగా వాడబడుతున్నాయి. ఆంగ్ల పదాలే కాదు, ఏ భాషా పదమైనా తేలిగ్గా అర్థమయ్యేది ప్రజల వాడుకలోది అయివుంటే చాలు. అంటే ఆనాటి 'మణి ప్రవాళాలు' మళ్ళీ వచ్చాయన్నమాట. కావ్య వస్తువు అంతర్జాతీయ పరిధికి ఎదిగింది. ప్రత్యేక వాదం విస్తృతమైంది. వ్యాకరణం పూర్తిగా దూరమైంది. సంధిని పాటించకుండా ప్రపంచ తెలుగు మహాసభలను జరుపుకుని తెలుగువాళ్లు వ్యాకరణాన్ని సమాధి చేశారు.

-- సాహితీ జోస్యం, శ్రీ రమణ పేరడీలు

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి